Blogs

మాజీ IAS అధికారి శ్రీ విజయ కుమార్ గారు APPSC  2021 -2025 GS ప్రీవియస్ పేపర్స్ సిరీస్ 1 ప్రారంభించారు

| Posted On 27 Jun 2026
మాజీ IAS అధికారి శ్రీ విజయ కుమార్ గారు APPSC  2021 -2025 GS ప్రీవియస్ పేపర్స్ సిరీస్ 1 ప్రారంభించారు

ప్రెస్ నోట్

తేదీ: 25 జూన్ 2026 (గురువారం)
స్థలం: మదనపల్లి

విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు నాణ్యమైన పోటీ పరీక్షల సన్నాహక అవకాశాలను అత్యంత తక్కువ వ్యయంతో అందించాలనే లక్ష్యంతో "WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *APPSC  2021 -2025 మధ్య నిర్వహించిన 40 జనరల్ స్టడీస్  ప్రీవియస్ పేపర్స్ సిరీస్–1 * మరియు దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోను గౌరవనీయులు మాజీ IAS అధికారి శ్రీ విజయ కుమార్ గారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు, 2026 జూన్ 25వ తేదీ గురువారం మదనపల్లిలో అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ విజయ కుమార్ గారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు నాణ్యమైన పరీక్షా సన్నాహక వనరులు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఆన్‌లైన్ మోడల్ పరీక్షను కేవలం ₹1కే అందించడం ఒక వినూత్నమైన మరియు ప్రశంసనీయమైన ప్రజాహిత కార్యక్రమమని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా సమాన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

"WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM) వ్యవస్థాపకులు డా. ఆర్. రెడ్డప్ప, ఎం.ఎస్‌సి., పీహెచ్.డి., ఫిజిక్స్ లెక్చరర్, విద్యార్థులు మరియు ఉద్యోగార్థులకు నాణ్యమైన ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, మోడల్ పరీక్షలు మరియు పోటీ పరీక్షల సన్నాహక సామగ్రిని అత్యంత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా APPSC జనరల్ స్టడీస్ ప్రీవియస్ పేపర్స్ సిరీస్–1, AP DSC (SGT) ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు, అలాగే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన మోడల్ టెస్టులు విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్యాలను సాధించాలని నిర్వాహకులు కోరారు.

Dr. Reddappa Rella M.Sc, Ph.D
వ్యవస్థాపకులు – "WWW.MPCEXAMS.COM" (http://WWW.MPCEXAMS.COM)\

సంప్రదింపు నంబర్లు:

700 300 6500

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.