Blogs

అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు AP DSC SGT [1994-2025] ప్రారంభించారు

| Posted On 24 Jul 2026
అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు AP  DSC  SGT  [1994-2025] ప్రారంభించారు

ప్రెస్ నోట్

మదనపల్లి, 17-07-2026

అన్నమయ్య జిల్లా డీఈఓ గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారి  చేతుల మీదుగా WWW.MPCEXAMS.COMలో ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిషన్ (AP DSC) Previous Exams Series (1994–2025) ప్రారంభం

అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి (District Educational Officer) గౌరవనీయులు శ్రీ కే. సుబ్రహ్మణ్యం గారు 17-07-2026 (శుక్రవారం) సాయంత్రం మదనపల్లిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో WWW.MPCEXAMS.COM ఆధ్వర్యంలో రూపొందించిన "Andhra Pradesh District Selection Commission (AP DSC) Previous Exams Series (1994–2025)", ఇందులో 1994 నుండి 2025 వరకు నిర్వహించిన 38 ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఉన్న సిరీస్‌ను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా WWW.MPCEXAMS.COM వ్యవస్థాపకులు డాక్టర్ రేల రెడ్డప్ప, ఎం.ఎస్‌సి., పీహెచ్.డి., లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, కలికిరి మాట్లాడుతూ, 1994 నుండి 2025 వరకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను AP DSC–2026 పరీక్షలకు హాజరుకానున్న నిరుద్యోగ అభ్యర్థుల కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.

అలాగే, ఇప్పటికే APPSC General Studies Previous Papers Seriesతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమాల్లో విద్యార్థులు, నిరుద్యోగ యువత ప్రతి పరీక్షను కేవలం ₹1 మాత్రమే చెల్లించి రాసే విధంగా దేశంలోనే వినూత్నంగా WWW.MPCEXAMS.COM ద్వారా అందిస్తున్నామని వివరించారు.

భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు, ప్రవేశ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన నాణ్యమైన ఆన్‌లైన్ ప్రాక్టీస్ పరీక్షలను విద్యార్థులు, నిరుద్యోగులకు అత్యంత తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ కె. ఆదినారాయణ, యూటీఎఫ్ (UTF) అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ ఆర్. మల్లికార్జున  UTF, ఉపాధ్యాయులు , మదనపల్లి పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.