Blogs

రాయచోటి DSP గౌరవనీయులు శ్రీ జిఆర్ కృష్ణమోహన్ సార్గారు NEET–2026 ఉచిత Mock Tests ప్రారంభించారు

| Posted On 27 Apr 2026
రాయచోటి  DSP  గౌరవనీయులు శ్రీ జిఆర్  కృష్ణమోహన్ సార్గారు  NEET–2026 ఉచిత Mock Tests ప్రారంభించారు

రాయచోటి DSP చేతుల మీదుగా NEET–2026 ఉచిత Mock Tests ప్రారంభం
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల విద్యార్థులకు 12 ఉచిత పరీక్షలు – 2015–2025 ప్రశ్నపత్రాలు కూడా అందుబాటులో
రాయచోటి, ఏప్రిల్ 27:
భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యా వనరులను అందించాలనే లక్ష్యంతో WWW.MPCEXAMS.COM సంస్థ ఆధ్వర్యంలో NEET–2026 పరీక్షకు భారతదేశ వ్యాప్తంగా హాజరయ్యే దాదాపు 25 లక్షల మంది విద్యార్థులకు12 ఉచిత Mock Tests మరియు 2015 నుండి 2025 వరకు National Testing Agency (NTA) నిర్వహించిన ప్రశ్నపత్రాలను అందించే కార్యక్రమాన్ని రాయచోటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) శ్రీ జి.ఆర్. కృష్ణమోహన్ గారు తమ కార్యాలయంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల విద్యార్థులు సమాన అవకాశాలు పొందేందుకు ఇటువంటి ఉచిత విద్యా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు.
WWW.MPCEXAMS.COM సంస్థ ప్రతినిధి డాక్టర్ రేళ్ళ రెడ్డప్ప, లెక్చరర్ ఇన్ ఫిజిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, కలికిరి మాట్లాడుతూ, 03 మే 2026 న జరగబోయే NEET–2026 పరీక్షకు భారతదేశ వ్యాప్తంగా హాజరయ్యే దాదాపు 25 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ Mock Tests పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్షలను 24/7 ఎప్పుడైనా, ఎక్కడైనా లాప్టాప్, డెస్క్టాప్, ట్యాబ్, మొబైల్ లేదా ఇతర డిజిటల్ పరికరాల ద్వారా రాయగలరని చెప్పారు. పరీక్ష రాసిన వెంటనే ఫలితాలను తెలుసుకునే సౌకర్యంతో పాటు ప్రతి పరీక్షకు డిజిటల్ e-సర్టిఫికేట్ కూడా పొందే అవకాశం కల్పించబడినట్లు వివరించారు.
పూర్తి వివరాలకు WWW.MPCEXAMS.COM వెబ్సైట్‌ను సందర్శించవచ్చు. అలాగే 700 300 6500 మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తాజా అప్డేట్స్ కోసం వెబ్సైట్‌లోని Blogs Page మరియు Facebook, Instagram ID: "MPCEXAMS" ను అనుసరించవచ్చు. సూచనలు మరియు సలహాలను mpcexams@gmail.com మెయిల్‌కు పంపవచ్చు.

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.