Blogs

పాలీసెట్ -2026మోడల్ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి  - వెటర్నరీ ఏడి వెంకట ముని  నాయుడు

| Posted On 04 Apr 2026
పాలీసెట్ -2026మోడల్ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి  - వెటర్నరీ ఏడి వెంకట ముని  నాయుడు

పాలీసెట్ -2026మోడల్ పరీక్షలు సద్వినియోగం చేసుకోండి 
- వెటర్నరీ ఏడి వెంకట ముని  నాయుడు  

 పాలీసెట్-2026 మోడల్ పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ ఏడి నాదము నాయుడు, అగ్రహారం మాజీ సర్పంచ్ ఉషారాణి అన్నారు. శుక్రవారం మండలంలోని మంచిగుంటపల్లె( కొండ కింద ) గ్రామంలో, స్థానికుడైన   అధ్యాపకుడు రేలా రెడ్డప్ప స్నేహితులతో కలసి, రూపొందించిన డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యూ, ఎంపీసీ ఎగ్జామ్స్. కామ్ వెబ్ సైట్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ వెబ్ సైట్ ద్వారా  దేశంలో మొట్టమొదటిసారిగా కేవలం ఒక్క రూపాయికి పాలీసెట్ మోడల్ ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. విద్యార్థులు ప్రతిరోజు   24 గంటల సమయంలో, ఎప్పుడైనా, ఎక్కడినుండైనా మొబైల్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ట్యాబ్ వంటి పరికరాల ద్వారా,, పరీక్ష రాసి, వాటి ఫలితాలను వెంటనే తెలుసుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చున్నారు. విద్యార్థులు అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ర్యాంకులు సాధించాలని నిర్వాహకులు రెడ్డప్ప కోరారు. భవిష్యత్తులో ఐ ఐ టి - జేఈఈ, నీట్, ఏపీపీఎస్సీ, యు పి పి ఎస్ సి   వంటి పోటీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను కూడా కేవలం ఒక్క రూపాయితో విద్యార్థులు,పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు అందించే ప్రయత్నం చేస్తామన్నారు.పూర్తి సమాచారం కోసం 7003006500 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలన్నారు. 
 ఫోటో ఉంది 
:- పాలీసెట్ -2026మోడల్ పరీక్షల వెబ్ సైట్ ను ప్రారంభిస్తున్న వెటర్నరీ ఏడి వెంకట ముని  నాయుడు.

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.