Blogs

అందుబాటులోకి ఉచిత ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సిరీస్‌

| Posted On 09 Apr 2026
అందుబాటులోకి ఉచిత ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సిరీస్‌

 

తేదీ: 09 ఏప్రిల్ 2026
స్థలం: అన్నమయ్య జిల్లా

ఈరోజు మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ శివ నారాయణ శర్మ, ఐఏఎస్ గారిని నిమ్మనపల్లి మండలం, మంచిగుంటపల్లి గ్రామానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రేల రెడ్డప్ప, M.Sc., Ph.D., మరియు మదనపల్లి కు చెందిన రాయల మల్లికార్జున టీచర్ మర్యాదపూర్వకంగా కలిసి, www.mpcexams.com వెబ్‌సైట్ ద్వారా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు IIT, JEE, NEET ఆన్‌లైన్ పరీక్షలను ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ప్రతి పరీక్షను కేవలం ₹1 రూపాయితో అందించే కార్యక్రమం గురించి వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గారు www.mpcexams.com అందించే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అదేవిధంగా, ఏప్రిల్ 25, 2026 న జరగబోయే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి, 2014 నుండి 2025 వరకు జరిగిన ప్రీవియస్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్‌ను www.mpcexams.com ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు 1,50,000 మంది విద్యార్థులకు ఉచితంగా అందించే ఎగ్జామ్ సిరీస్‌ను జాయింట్ కలెక్టర్ గారు అధికారికంగా ప్రారంభించారు.

జాయింట్ కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యార్థులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ర్యాంకు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీ శివ నారాయణ శర్మ గారు ప్రారంభించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ను విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు అందించే మా ప్రయత్నాలకు తోడ్పడినందుకు, జాయింట్ కలెక్టర్ గారికి www.mpcexams.com తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము.

— www.mpcexams.com టీమ్

© Copyright © 2025 MpcexamsOES . All Rights Reserved.